ఏఎఫ్‌సీ ఏసియన్ కప్-2023 ఫైనల్స్‌కు సునీల్ ఛెత్రి సారథ్యంలోని భారత పుట్‌భాల్ జట్టు అర్హత సాధించింది. ఇప్పటివరకు ఐదుసార్లు పైనల్స్‌కు చేరిన ఇప్పుడు వరుసగా రెండోసారి ఆ ఘనత సాధించింది. కోల్‌కతాలో నిర్వహించే ఫైనల్స్‌లో ప్రత్యర్థి హాంగ్‌కాంగ్‌తో భారత్ తలపడాల్సి ఉంటుంది. నిజానికి ఈనెల 17న గ్రూప్ డీలో మూడో రౌండ్ ఫైనల్ క్వాలిఫయింగ్ మ్యాచ్ జరగాల్సి ఉన్నప్పటికీ భారత్ ఫైనల్స్ కు చేరే అవకాశం దక్కింది. గ్రూప్ డీలో 6 పాయింట్లతో భారత్ రెండో స్థానంలో నిలవగా హాంగ్‌కాంగ్‌తో టై అయ్యింది. అందువల్ల ఆ రెండు జట్లు ఫైనల్స్‌కు చేరినట్టయింది.
కాగా మంగళవారం ఉదయం జరిగిన గ్రూప్ బీ మ్యాచ్‌లో ఫిలిప్పీన్స్‌ను పాలస్తీనా జట్టు ఓడించడంతో భారత్‌కు కలసివచ్చింది. ఇప్పటివరకు కంబోడియాపై 2-0, అఎn్గానిస్తాన్‌పై 2-1 గోల్స్ తేడాతో విజయం సాధించింది. ఈ ఏఎఫ్‌సీ ఏసియన్ కప్ -2023 టోర్నీలో భాగంగా జూన్ 16 నుంచి జులై 17వరకు పోటీలను చైనా నిర్వహిస్తోంది. పది పట్టణాల్లో ఈ పోటీలు నిర్వహించాల్సి ఉండగా కోవిడ్ మహమ్మారి విజృంభణ నేపథ్యంలో కొత్త వేదికలను త్వరలో ప్రకటిస్తారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.