Tuesday, November 26, 2024

మ్యాచ్‌కు ముందు శృంగారం చేయాలని టీమిండియా క్రికెటర్లకు సలహా

ఎంతటి జట్టుకైనా ప్రపంచకప్‌లో ఆడుతుంటే చాలా ఒత్తిడి ఉంటుంది. క్రికెటర్ల మనసుల్లో భయం నెలకొని ఉండటం సహజమే. ఆ భయాన్ని పోగొట్టేందుకు నిపుణులు, కోచ్‌లు విలువైన సలహాలు ఇస్తుంటారు. అయితే 2011 వరల్డ్ కప్ సమయంలో టీమిండియా ఆటగాళ్లకు అప్పటి మెంటల్ కండీషనింగ్ కోచ్ ప్యాడీ ఆప్టన్ ఓ వింత సూచన చేశాడట.

మ్యాచ్‌లకు ముందు సెక్స్ చేయాలని ప్యాడ్ ఆప్టన్ టీమిండియా క్రికెటర్లకు సలహా ఇచ్చాడట. దాంతో అప్పటి కోచ్ గ్యారీ కిరెస్టన్ నోట మాట రాలేదట. ఏం చెప్పాలో తెలియక బిక్కమొహం వేశాడట. ఈ విషయాలను తాజాగా ప్యాడీ ఆప్టన్ తన ఆత్మకథ ‘ది బేర్ ఫూట్ కోచ్’ పుస్తకంలో పొందుపరిచాడు. శృంగారం చేయాలని క్రికెటర్లకు సలహా ఇచ్చినందుకు ఆ తర్వాత క్షమాపణ తెలియజేశానని ప్యాడీ ఆప్టన్ వివరించాడు. కోచ్‌గా ఉన్నప్పుడు చెప్పని విషయాలను తన ఆత్మకథ ద్వారా ప్యాడీ ఆప్టన్ బహిరంగపరుస్తున్నాడు.

ఇది కూడా చదవండి: ముగిసిన క్వారంటైన్.. స్విమ్మింగ్ ఫూల్‌లో టీమిండియా ఆటగాళ్లు

Advertisement

తాజా వార్తలు

Advertisement