Tuesday, November 26, 2024

Delhi | నిల‌క‌డ‌గా అద్వానీ ఆరోగ్య పరిస్థితి..

బీజేపీ సీనియర్ నేత, మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఆయ‌న ప్రస్తుతం అపోలో ఆసుపత్రి వైద్యుల బృందం పర్యవేక్షణలో ఉన్నారు. అద్వానీ నిన్న జూలై 3 (బుధవారం) రాత్రి అనారోగ్యంతో న్యూఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చేర‌గా.. అద్వానీ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అపోలో ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

కాగా, ప్ర‌స్తుతం ఆయ‌న‌ న్యూరాలజీ విభాగం సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ వినిత్ సూరి పర్యవేక్షణలో ఉన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement