న్యూఢిల్లీ : అరవై ఏళ్ల పైబడిన వారికి టీకా బూస్టర్ డోస్ ఇచ్చేందుకు ఎటువంటి సర్టిఫికెట్లు చూపించాల్సిన అవసరం లేదని కేంద్ర వైద్యఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. మంగళవారం నాడు నిర్వహించిన ఓ సమావేశంలో ఈ నిర్ణయంతీసుకున్నట్లు వెల్లడించింది. బహుళ అనారోగ్య సమస్యలతో ఇబ్బందు పడుతున్నవృద్ధులకు ముందస్తు జాగ్రత్తగా బూస్టర్ డోస్ ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిసిందే.
అయితే వారికి ఇతర అనారోగ్య సమస్యలున్నట్లు వైద్యులకు ధ్రువపత్రం సమర్పించాలన్న ఆందోళన వ్యక్తం అవుతున్న నేపథ్యంలో కేంద్రం ఈ సమావేశంలో స్పష్టతనిచ్చింది. అయితే బూస్టర్ డోస్ తీసుకోవాలనుకున్న వృద్ధులు తమ కుటుంబ వైద్యుడి సలహా తీసుకోవడం మంచిదని సూచించింది. తాజా నిర్ణయం, తదితర వివరాలతో కూడిన ప్రకటనను కేంద్ర వైద్యశాఖ కార్యదర్శి రాకేష్ భూషణ్ చదివి విన్పించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital