హైదరాబాద్, ఆంధ్రప్రభ: ఆరు ప్రైవేట్ యూనివర్శిటీల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోద ముద్రవేసిన విషయం తెలిసిందే. అయితే ఈ యూనివర్శిటీలు రాబోయే 2022-23 విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి రానున్నాయని సమాచారం. అడ్మిషన్ల ప్రక్రియ కూడా ఇదే సంవత్సరం నుంచి చేపట్టనున్నట్లు తెలిసింది. అయితే దీనికి సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది. ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చిన వెంటనే ఆయా వర్శిటీలు అడ్మిషన్ల ప్రక్రియకు సంబంధిచిన నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నట్లు సమాచారం.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..