వరంగల్, ప్రభన్యూస్ ప్రతినిధి: బీఎస్సీ నర్సింగ్, ఏబీబీఎస్సీ నర్సింగ్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం తెలిపింది. ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో కన్వీనర్ కోటా సీట్ల ప్రవేశాలకు యూనివర్సిటీ ఆదివారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంసెట్లో అర్హత సాధించిన అభ్యర్థులు ఈనెల 20 నుంచి 31వ తేదివరకు ఆన్లైన్లో దరఖాస్తులు అందుబాటులో ఉంటాయన్నారు.
నాలుగేళ్ల డిగ్రీ కోర్సు బ్యాచిలర్ ఆఫ్ నర్సింగ్ (బీఎస్సీ నర్సింగ్) రెండు సంవత్సరాల డిగ్రీ కోర్సు పోస్ట్ బ్యాచిలర్ ఆఫ్ నర్సింగ్ (పీబీబీఎస్సీ నర్సింగ్) కోర్సుల్లో ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రవేశాలకు కలిపించనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 31వతేది సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవాలి. ధృవపత్రాల పరిశీలన అనంతరం తుది మెరిట్ జాబితాను విడుదల చేయనున్నారు. పూర్తి వివరాలకు యూనివర్సిటీ వెబ్సైట్లో చూడాలని యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపారు.