ప్రైవేటు ఆసుపత్రులతో వ్యవహారం అంటే అతి ఖరీదైనదని తెలిసిందే.అయితే ఓ భారతీయ పర్యాటకుడికి మాత్రం ఫ్రాన్స్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఉచితంగా వైద్యం అందింది. గుజరాత్ లోని వడోదరకు చెందిన అనిల్ గోయల్ అనే వ్యక్తి కుటుంబంతో కలిసి యూరప్ టూర్ వెళ్లారు. విహారయాత్రలో భాగంగా అనిల్ గోయల్ ఫ్రాన్స్ కూడా వెళ్లారు. అయితే పారిస్ లో పర్యటిస్తుండగా ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దాంతో కుటుంబ సభ్యులు ఆయనను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి సిబ్బంది అతడికి ఐసీయూలో చికిత్స అందించారు. కాగా అనిల్ గోయల్ గుజరాత్ రాష్ట్రానికి చెందినవాడని ఆసుపత్రి సిబ్బంది తెలుసుకున్నారు. గుజరాత్ అంటే భారత ప్రధాని నరేంద్ర మోడీకి చెందిన రాష్ట్రం అని వారు గుర్తించారు. ఆ ఆసుపత్రి సిబ్బంది, యాజమాన్యం దృష్టిలో మోడీ అంటే ఓ గొప్ప ప్రపంచస్థాయి నేత. ఇంకేముందీ, మోడీకి చెందిన రాష్ట్రం నుంచి వచ్చిన అనిల్ గోయల్ వారికి ఓ వీఐపీ అయిపోయాడు. తమ ఆసుపత్రిలో ఉన్న సౌకర్యాలన్నింటిని గోయల్ కు అందించారు. అత్యంత ఖరీదైన వైద్యం చేసి అతడిని మామూలు మనిషిని చేశారు. అంతేకాదు, లక్షల్లో ఉన్న అతడి ఆసుపత్రి బిల్లును కూడా మాఫీ చేశారు.
ఇక అనిల్ గోయల్ కు, అతడి కుటుంబ సభ్యులకు ఇదొక అద్భుతమే అయింది. ఊహించని రీతిలో లభించిన ఈ వీఐపీ ట్రీట్ మెంట్ వారిని సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. మోడీకి ఉన్న క్రేజ్ మామూలుగా లేదుగా. మోడీ పుణ్యమా అని ఒకరి ప్రాణాన్ని నిలిపారు.
యూరప్ టూర్ లో అస్వస్థతకి గురైన వ్యక్తి- మోడీపై అభిమానంతో ఫ్రీగా ట్రీట్ మెంట్
Advertisement
తాజా వార్తలు
Advertisement