న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఫైబర్‌నెట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం. త్రివేదితో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఎదుట ఈ కేసు మంగళవారం విచారణకు వచ్చింది. జాబితాలో 3వ నెంబర్ కేసుగా ఉన్నప్పటికీ.. ఇదే ధర్మాసనం ఎదుట ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌పై విచారణ జరుగుతున్నందున, ఆ విచారణ ముగిశాక బెయిల్ పిటిషన్‌పై విచారణ చేపడతామని ధర్మాసనం తెలిపింది. దాంతో కేసు తొలుత మధ్యాహ్నానికి వాయిదా పడింది. మధ్యాహ్నం భోజన విరామం అనంతరం స్కిల్ స్కాం కేసులో వాదనలు కోర్టు సమయం ముగిసేవరకు కొనసాగాయి. దీంతో ధర్మాసనం బెయిల్ పిటిషన్‌పై విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement