అమరావతి, ఆంధ్రప్రభ : ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలను ఈ నెల 9న మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించనున్నట్లు ఆ పార్టీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు సివేరి దొన్నుదొర వెల్లడించారు. శనివారం మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో ఈ వేడుకలకు తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని పేర్కొన్నారు. అలాగే రాష్ట్ర నలుమూలల నుంచి పార్టీకి చెందిన గిరిజన నేతలు, ముఖ్య కార్యకర్తలు పాల్గొంటారని తెలిపారు. వైకాపా అధికారంలోకి వచ్చిన నాటి నుంచి గిరిజనుల సంక్షేమాన్ని ఏమాత్రం పట్టించుకున్న దాఖలాలు లేవని 12 పథకాలను రద్దు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
తరతరాలుగా గిరిజనుల పిల్లలు వి ద్యకు దూరమైన పరిస్థితుల నుంచి ఇప్పుడిప్పుడే విద్యోన్నతి బాట పట్టారని ఇటువంటి సమయంలో పథకాలను రద్దు చేయడం సరికాదన్నారు. ఈ నేపథ్యంలోనే ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో గిరిజనులకు జరుగుతున్న అన్యాయం ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఎండగడతామని దొన్నుదొర స్పష్టం చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.