Saturday, November 23, 2024

Aditya-L1 Mission : నాలుగో కక్ష్య పెంపు విజయవంతం

బెంగళూరు – సూర్యుని పై పరిశోధనలు చేసేందుకు ఇస్రో ప్రయోగించిన ఆదిత్య ఎల్-1 మిషన్ లో మరో కీలక ఘట్టం నమోదైంది. ఆదిత్య ఎల్-1 ఉపగ్రహం సూర్యుడిని చేరుకునేందుకు నాలుగో సారి భూ కక్ష్యను పెంపును ఇస్రో శాస్త్రవేత్తలు విజయవంతంగా పూర్తి చేశారు.

బెంగళూరులోని టెలిమెట్రీ, ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్ వర్క్ కేంద్రంగా ఇస్రో ఆపరేట్ చేస్తుంది. అదేవిధంగా మారిషస్, పోర్ట్ బ్లెయిర్ లోని ఇస్రో గ్రౌండ్ స్టేషన్లు భూ కక్ష్య పెంపును సమీక్షించాయి. ప్రస్తుతం ఆదిత్య ఎల్-1 శాటిలైట్ 256 కి.మీ x 121973 కి.మీ. కక్ష్యలోకి ప్రవేశించినట్లు ఇస్రో శాస్త్రవేత్తలు వెల్లడించారు. శాటిలైట్ ఎల్-1 పాయింట్ కు చేరాలంటే మరో నాలుగు నెలల సమయం పడుతుందని పేర్కొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement