తిరుపతిలో ఎన్టీఆర్ స్టేడి యంలో జరిగిన ఆదిపురుష్ ప్రిరిలీజ్ వేడుకలలో చిత్ర హీరోయిన్ కృతి సనన్ మాట్లాడుతూ , .”అందరికీ నమస్కారం.. నమస్కారం అన్నాలా లేదా నేను హాయి డార్లింగ్స్ అని అనాలా.. ఎలా ఉన్నారు? నాకు ఇక్కడ ఉండడం చాలా చాలా ఆనందంగా ఉంది. నేను నా కెరియర్ ని తెలుగులో ప్రారంభించాను. ఇప్పుడు మళ్లీ తొమ్మిది సంవత్సరాల తర్వాత మీ అందరి ఆశీర్వాదం వల్ల ఇక్కడ ఎంతో ప్రీషియస్ ఫిలిం ఆది పురుష్ వల్ల మీ ముందర ఉన్నాను. ఇలాంటి స్పెషల్ క్యారెక్టర్.. జానకి దేవి.. చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి క్యారెక్టర్స్ కొంతమంది నటులకు మాత్రమే తమ కెరియర్ లో వస్తుంది. మీ ప్రేమ వల్లే నేను ఇక్కడ ఉన్నాను. థాంక్యూ ఫర్ ఆల్ యువర్ లవ్.. మనం సినిమాలను ఎంచుకోలేము.. సినిమాలే మనల్ని ఎంచుకుంటాయి. ఇలాంటి సినిమాలో నన్ను.. జానకి క్యారెక్టర్ తీసుకోవడం నిజంగా నా అదృష్టం. మీ ప్రేమ మరియు మీ ఆశీర్వాదం వల్లే నాకు ఆఫర్ వచ్చింది. నాకు ఇంకా కూడా మీ ప్రేమ , ఆశీర్వాదం కావాలి. నేను మీ అందరిని ప్రేమిస్తున్నాను జైశ్రీరామ్,” అని అన్నారు.
ఇక ప్రభాస్ ఆఫ్ స్క్రీన్ లో ఎలా ఉంటారు అని యాంకర్ ప్రదీప్ అడిగిన ప్రశ్నకు సమాధానముగా కృతి..”ప్రభాస్ ఎక్కువ మాట్లాడారు అని విన్నాను.. కానీ అది నిజం కాదు. తాను ఎక్కువగా మాట్లాడుతారు. తను నిజంగా డార్లింగ్ మరియు స్వీట్ హార్ట్. తను చాలా హాడ్ వర్కర్ మరియు చాలా స్వీట్ పర్సన్. అలానే ఫుడ్ ని బాగా ఇష్టపడే మనిషి కూడా. తన కళ్ళల్లో ఉన్న ప్యూరిటీ చూస్తే అసలు ఈ సినిమాలో రాముడు క్యారెక్టర్ తను తప్ప వేరే వాళ్ళు చేయగలరు అని నేను అనుకోవడం లేదు” అంటూ తన స్పీచ్ ని ముగించింది .