ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో 18 ఏళ్ల జమ్మూకాశ్మీర్ కుర్రాడు ఆదిల్ అల్తాఫ్ అదరగొట్టాడు. సైక్లింగ్ విభాగంలో తొలి స్వర్ణం సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. 70 కిమీ సైక్లింగ్ రోడ్ రేసులో ఆదిల్ అల్తాఫ్ అందరి కంటే ముందుగా గమ్యాన్ని చేరి పసిడి అందుకున్నాడు. అంతకముందు ఒక్కరోజు ముందు 28కిమీ విభాగంలో నిర్వహించిన రేసులో రజతం సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు.
ఒక టైలర్ కొడుకు తమ రాష్ట్రానికి స్వర్ణం పతకం తీసుకురావడంతో జమ్మూకాశ్మీర్ లెప్టిnనెంట్ గవర్నర్ మనోజ్ సింహా ఆదిల్ అల్తాఫ్‌ను ప్రత్యేకంగా అభినందించాడు. ఇక ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో పతకం సాధించాలనే కాంక్షతో ఆదిల్ అల్తాప్ గత ఆరు నెలలుగా పాటియాలాలోని ఎన్‌ఐఎస్‌లో శిక్షణ తీసుకున్నాడు. తాజాగా స్వర్ణం సాధించడంతో ఆదిల్ అల్తాఫ్ తన కలను నెరవేర్చుకున్నాడు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.