Friday, November 22, 2024

టీమ్‌ ఇండియా కిట్‌ స్పాన్సర్‌గా అడిడాస్‌..

ప్రముఖ జర్మన్‌ కంపెనీ అడిడాస్‌ ఇకపై టీమ్‌ఇండియా కిట్‌ స్పాన్సర్‌గా వ్యవహరించనుంది. క్రీడా సంబంధిత వస్తువులు ఉత్పత్తి చేసే అడిడాస్‌తో జతకట్టనున్నామని బీసీసీఐ కార్యదర్శి జై షా ప్రకటించారు. ఈ ఒప్పందం జూన్‌ 1 నుంచి అమలులోకి రానుందని తెలిపారు. ఎంపీఎల్‌ స్పోర్ట్స్‌ 2020 నుంచి 2023 డిసెంబర్‌ వరకు భారత జట్టుకు కిట్‌ స్పాన్సర్‌గా వ్యవహరించాల్సి ఉన్నది.

- Advertisement -

అయితే ఆ సంస్థ గత డిసెంబర్‌లో అర్థాంతరంగా తప్పుకోవడంతో కెవాల్‌ కిరణ్‌ (కిల్లర్‌ జీన్స్‌) తాత్కాలిక కిట్‌ స్పాన్సర్‌గా ఉన్నది. ఈ గడువు మే 31తో ముగియనుంది. అంతకుముందు 2016 నుంచి 2020 వరకు నైక్‌ సంస్థ టీమ్‌ఇండియా కిట్‌ స్పాన్సర్‌గా వ్యహరించింది. ప్రపంచంలోని ప్రముఖ క్రీడా దుస్తుల బ్రాండ్‌లలో ఒకటైన అడిడాస్‌తో కలిసి పనిచేయడానికి ఉత్సాహంగా ఉన్నాం. వెల్‌కమ్‌ అడిడాస్‌ అని జై షా ట్వీట్‌ చేశారు.

కాగా, 2023 నుంచి 2028 వరకు అంటే ఐదేళ్లపాటు టీమిండియా కిట్‌ స్పాన్సర్‌గా అడిడాస్‌ వ్యవహరించనుంది. ఇందుకుగాను ఒక్కోమ్యాచ్‌కు రూ.65 లక్షలు చెల్లించనుంది. దీనిప్రకారం ఏటా సుమారు రూ.70 కోట్లు (ఐదేళ్లకు రూ.350 కోట్లు) చెల్లించేందుకు ఒప్పందం కుదిరిందని సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement