హైదరాబాద్, ఆంధ్రప్రభ: ఆర్టీసీ క్రమంగా లాభాల బాట పడుతోందని టీఎస్‌ఆర్టీసీ సంస్థ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్, ఎండీ సజ్జనార్ తెలిపారు. ఆర్టీసీ ఉన్నతాధికారులతో వీరు శనివారం బస్‌భవన్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్టీసీ ఓఆర్ క్రమంగా పెరుగుతోందని, దాన్ని 70 నుంచి 75 శాతం వరకు వచ్చే విధంగా కృషి చేయాలని అధికారులకు ఆదేశించారు. గత సెప్టెంబర్ నెలలో 15 డిపోలు లాభాల బాటలోకి రావడం చాలా సంతోషకరమన్నారు. కార్గో ఆదాయం రూ.7 కోట్లు వస్తుందని, దాన్ని రూ.11 కోట్ల నుంచి రూ.12 కోట్ల వరకు పెంచాలని సూచించారు. రాబోయే పండుగులైన కార్తీకమాసం, సంక్రాంతి పండుగలకు అదనపు బస్సులను నడిపి అధిక ఆదాయాన్ని తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ సమావేశంలో ఈడీ అధికారులు, ఆర్‌ఎంలు పాల్గొన్నారు.
- Advertisement -