Friday, January 24, 2025

ADB l కుమారుడి చేతిలో తండ్రి హతం

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని ఇందారం గ్రామంలో దారుణ హత్య జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఆవిడపు రాజన్న అనే వ్యక్తిని తనయుడు సాయి సిద్ధార్థ్ (సిద్దు) హత్య చేశాడు

ఈ హత్య స్థానికులను తీవ్రంగా కలిచివేసింది. సాయి సిద్ధార్థ్ తన తండ్రిని గొంతు కోసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. హత్య అనంతరం సిద్ధార్థ్ స్వయంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. అయితే, ఈ ఘోరానికి సిద్ధార్థ్‌తో పాటు మరో ఇద్దరు స్నేహితులు కూడా సంబంధం ఉన్నట్లు పోలీసుల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement