మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథా ఆధారంగా అడివి శేష్ తెరకెక్కించిన సినిమా “మేజర్ష . సినిమా కోసం మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ తల్లిదండ్రులను ఒప్పించడంలో తాను పడ్డ కష్టాల గురించి మీడియాతో మాట్లాడారు అడివి శేష్. మొదటిసారి మేజర్ సందీప్ తండ్రికి ఫోన్ చేసినప్పుడు, ఆయన ఫోన్ కట్ చేశారని.. ఆ తర్వాత షూటింగ్ స్టార్ట్ అయ్యే ముందు ఏడుసార్లు కుటుంబసభ్యులను కలిశాం అని వివరించాడు శేష్. పూణే, అహ్మదాబాద్, ఢిల్లీ ఇతర నగరాల్లో ప్రత్యేకించి ఆర్మీ, పారామిలటరీ వ్యక్తుల కోసం వాల్లు ఏర్పాటు చేసిన ప్రత్యేక సినిమా ప్రదర్శనల గురించి మీడియాకు తెలిపారు.
ఆ స్క్రీనింగ్స్‌కు అద్భుతమైన స్పందన వచ్చినందుకు నటుడు అడివి శేష్ ఉత్సాహంగా కృతజ్ఞతలు తెలిపారు. సినిమా చూసి చాలా మంది మహిళలు, ఆర్మీ సిబ్బంది కన్నీరుమున్నీరుగా విలపించారు. సినిమా చూసిన ఎన్‌ఎస్‌జి ముంబై యూనిట్ వారికి ఓ మెడల్ కూడా ఇచ్చిందని.. ఆ మెడల్ ను ఓ ఆస్కార్ కంటే కూడా ఎక్కుక భావిస్తున్నట్టు పేర్కొన్నాడు నటుడు అడవి శేష్.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..