ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్ (ఐవోఏ)లో అదానీ గ్రూప్‌నకు చెందిన అదానీ స్పోర్ట్స్‌లైన్ అధికారిక భాగస్వామి కానుంది. బర్మింగ్‌హామ్‌లో జరుగనున్న కామన్వెల్త్ గేమ్స్-2022, హంగౌజ్ ఏసియన్ గేమ్స్- 2022, పారిస్ ఒలింపిక్స్ గేమ్స్-2024లకు భారత ఒలింపిక్ సమాఖ్యతోపాటు అదానీ స్పోర్ట్స్‌లైన్ భాగస్వామిగా వ్యవహరించనుంది. అదానీ గ్రూప్ ఐవోఏతో భాగస్వామి కావడం ఇది రెండోసారి. 2021 టోక్యో ఒలింపిక్స్‌లో భారత జట్టుకు స్పాన్సర్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే.
అంతర్జాతీయ క్రీడా రంగంలో భారత్ ఖ్యాతిని ఇనుమడింపజేయడమే లక్ష్యంగా ఐవోఏ పని చేస్తున్నదని, ఈ లక్ష్యసాధనలో అదానీ గ్రూప్ కలిసి రావడం ఆనందదాయకమని భారత ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యదర్శి రాజీవ్ మెహతా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. టోక్యో ఒలింపిక్స్2021లో 28 మంది అథ్లెట్స్‌కు అదానీ స్పోర్ట్స్‌లైన్ సహకారం అందించిందని, 57కేజీల విభాగంలో రెజ్లర్ రవికుమార్ దహియా సిల్వర్ మెడల్ సాధించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఐవోఏతో జరిగిన ఎంవోయూ కార్యక్రమంలో అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ డైరెక్టర్ ప్రణవ్ అదానీ తదితరులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.