Monday, November 18, 2024

అగాధంలో అదాని, పాతాళంలో ఇన్వెస్ట‌ర్లు..

న్యూఢిల్లి: గత కొన్ని రోజులుగా దేశీయ షేర్‌ మార్కెట్లను పట్టి కుదిపేస్తున్న అదానీ గ్రూప్‌ శుక్రవారం కూడా అదే ఊగిసలాటలో సాగింది. బహుశా దలాల్‌ స్ట్రీట్‌ చరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా అదానీ గ్రూప్‌ షేర్లు వారాంతంలో కూడా మదుపరులతో ఆటాడుకున్నాయి. ముఖ్యంగా గ్రూపులో ప్రధాన షేర్‌ అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ కదలాడిన తీరు చూసి ఆరితేరిన ట్రేడర్లు సైతం అల్లల్లాడి పోయారు.

శక్రవారం మార్కెట్‌లు బుల్లిష్‌గానే ప్రారంభమయ్యాయి. ప్రారంభ మైన నిమిషం నుంచే అదానీ గ్రూప్‌ సయ్యాట మొదలైంది. అదానీ ఎంటర్‌ ప్రైజెస్‌ జర్రున జారడం ప్రారంభమైంది. తొలుత పది శాతం పతనం కావడంతో కొంతసేపు ట్రేడ్‌ నిలిచింది. మళ్లిd మొదలైంది… ఆ తర్వాత 15, 20, 25, 30, 35, 40 శాతం వరకు పతనమైంది. ఇలా ఒక్కరోజే ఒక కంపెనీ షేర్‌ ఈవిధంగా ఏడుసార్లు సర్క్యూట్‌లను తాకి పడిపోవడం బహుశా దలాల్‌ స్ట్రీట్‌లో సత్యం తర్వాత ఇదే తొలిసారని భావిస్తున్నారు. నాలుగు రోజుల క్రితం ఈ షేర్‌ రూ.4,000 పైనే కదలాడింది. అక్కడి నుంచి రూ.3,200లకు అంటే 25 శాతం పడిపోయింది. దీంతో సామాన్య మదుపుదారులు విపరీతంగా ఎగబడ్డారు. అద్భుతమైన షేర్‌ 25 శాతం చీప్‌గా దొరుకుతోందని సంబరపడ్డారు. కాని, గత మూడు రోజుల్లోనే చుక్కలు కనిపించాయి. నేడు కనిష్ట స్థాయి అంగే రూ.940లకు ఒక దశలో షేర్‌ పడిపోయింది. ఒక్కరోజే 40 శాతం పడిపోయిన షేర్‌ తిరిగి 50 శాతానికి పైగా ఎగబాకి 90 శాతం చలించింది…

Advertisement

తాజా వార్తలు

Advertisement