న్యూఢిల్లి : ప్రపంచంలోనే అతిపెద్ద సిమెంట్ తయారీ సంస్థ హోల్సిమ్ గ్రూప్ వాటాల విక్రయానికి వ్యాపార దిగ్గజాలైన అదానీ గ్రూప్, జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌లతో చర్చలు ప్రారంభించింది. ఈ భారీ డీల్ విలువ దాదాపు 10 బిలియన్ డాలర్లుగా ఉండొచ్చని తెలుస్తున్నది. ఈ సేల్ ద్వారా దేశంలో కంపెనీకి ఉన్న అంబుజా సిమెంట్, ఏసీసీ సిమెంట్ కంపెనీలను విక్రయించనుంది. ప్రస్తుతం ఈ చర్చలు చివరి దశకు చేరుకున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. దిగ్గజ వ్యాపార వేత్త కుమార మంగళం బిర్లాకు చెందిన అల్ట్రాటెక్ సంస్థ కొనేందుకు ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తున్నది. ఇప్పటి వరకు ఎలాంటి చర్చలు జరపలేదు. కంపెనీ వ్యతిరేక ఆందోళనలు ఉన్నప్పటికీ.. పోటీలో చేరాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. మే నెలాఖరులోగా షేర్ పర్చేజ్ అగ్రిమెంట్ చర్చలు పూర్తవుతాయని తెలుస్తోంది. ఈ లోగా ఫైనాన్సింగ్‌కు సంబంధించిన అన్ని వివరాలు వ్యక్తం కావొచ్చు.
త్వరలో అధికారిక ప్రకటన..
షేర్ పర్చేజ్ అగ్రిమెంట్ నిబంధనలను ఖరారు చేసిన తరువాత.. కమిటెడ్ ఫైనాన్సింగ్ చూపేందుకు అవకాశం ఉంటుందని తెలుస్తోంది. అది పూర్తయిన తరువాత.. ముందుగా సదరు కంపెనీ ఆస్తులను పొందుతుంది. అంబుజా సిమెంట్స్, ఏసీసీ సిమెంట్స్ రెండూ స్టాక్ ఎక్స్ఛేంజీలో లిస్టెడ్ కంపెనీలే అని సీనియర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ తెలిపాడు. సేల్ రిపోర్టులు వెలువడినప్పటి నుంచి ఈ కంపెనీల షేర్లు ఓలటైల్‌గా మారాయి. కంపెనీ తన ఆప్షన్స్ తెరిచి ఉంచుతోందని, సూటర్‌ను ఖరారు చేసిన తరువాత సమయాన్ని దృష్టిలో ఉంచుకుని హోల్సిమ్ తన తుది నిర్ణయాన్ని కొన్ని గంటల్లోనే ప్రకటిస్తుందని సమాచారం. దీర్ఘ కాల చర్చల కోసం కంపెనీలు ప్రత్యేక ఒప్పందంలోకి వచ్చే అవకాశం లేదని తెలుస్తున్నది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..