Friday, November 22, 2024

ప్రపంచ కుబేరుల జాబితాలో 4వ స్థానంలో అదానీ..

సంపదలో అదానీ దూసుకుపోతున్నారు. అతి తక్కువ కాలంలోనే ఆయన ప్రపంచ కుబేరుల జాబితాలో మూడో స్థానానికి చేరుకున్నారు. ఫోర్బ్స్‌ పత్రిక తాజాగా వెల్లడిం చిన వివరాల ప్రకారం ప్రపంచ అపరకుబేరుల జాబితాలో మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ను వెనక్కి నెట్టిన అదానీ నాలుగో స్థానానికి చేరుకున్నారు. గేట్స్‌ ఫౌండేషన్‌కు బిల్‌గేట్స్‌ 20 బిలియన్‌ డాలర్లు విరాళం ఇవ్వడంతో ఆయన తన స్థానాన్ని కోల్పోయారు. క్రమంగా విరాళాలు పెంచుకుంటూ తాను సంపన్నుల జాబితా నుంచి బయటకు వస్తానని ఆయన ఇటీవలనే ప్రకటించారు.

నాలుగో స్థానానికి చేరుకున్న గౌతమ్‌ అదానీ మొత్తం సంపద 114 బిలియన్‌ డాలర్లుగా ఉన్నట్లు ఫోర్బ్స్‌ అంచనా వేసింది. 5వ స్థానానికి చేరిన బిల్‌గేట్స్‌ సంపద 102 బిలిన్‌ డాలర్లుగా ఉంది. టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌ 230 బిలియన్‌ డాలర్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. బెర్నార్డ్‌ అర్నాల్డ్‌ రెండో స్థానంలో , అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌ మూడో స్థానంలో ఉన్నారు. రిలయన్స్‌ అధినేత ముఖేస్‌ అంబానీ మాత్రం 10వ స్థానంలో ఉన్నారు. అంబానీ సంపద 88 బిలియన్‌ డాలర్లు ఉన్నట్లు ఫోర్బ్స్‌ అంచనా వేసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement