బిలియనీర్ గౌతమ్ అదానీకి చెందిన స్టాక్స్ రోజు రోజుకూ పతనమవుతున్నాయి. హిండెన్‌బర్గ్ రిపోర్ట్ అదానీ గ్రూప్ స్టాక్‌లలో పతనానికి కారణమయ్యింది. ఆ నివేదిక గురించి USలోని హిండెన్‌బర్గ్ రీసెర్చ్ అనే షార్ట్ సెల్లర్ సంస్థ పలు ఇంపార్టెంట్ అంశాలను బహిర్గతం చేస్తోంది. అదానీ గ్రూప్ కంపెనీలు ఇప్పుడు $99 (8.14లక్షల కోట్లు) బిలియన్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ను కలిగి ఉన్నాయి. ఇక.. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక కంటే ముందు $217 (ఒక కోటి 78లక్షల కోట్లు)బిలియన్లు అని ఓ ఫైనాన్స్ వెబ్సైట్ ఫార్చ్యూన్ అంచనా వేసింది.
అదానీ గ్రూప్ 10 రోజుల్లో $118 (9.70 లక్షల కోట్లు) బిలియన్లను కోల్పోయింది, హిండెన్‌బర్గ్ గ్రూప్ స్టాక్ మానిప్యులేషన్, పన్నుల విధానాన్ని సక్రమంగా పాటించకపోవడం, మనీలాండరింగ్, పెరుగుతున్న అప్పుల గురించి ఆరోపణలు వచ్చినప్పటి నుండి అదానీ గ్రూప్ షేర్లలో 50 శాతం క్షీణత కనిపిస్తోంది.
ఆసియాలో అత్యంత సంపన్నుడిగా ఉన్న అదాని స్థానం.. ఆ ప్లేస్ నుంచి క్రమంగా పడిపోతూ వస్తోంది. ఈ వారం ఒక ప్రకటనలో పెట్టుబడిదారుల ప్రయోజనాలే ప్రధానమని, తన ఫ్లాగ్షిప్ కంపెనీ అయిన అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో రూ. 20,000 కోట్ల వాటా విక్రయాన్ని రద్దు చేసినట్లు ఆయన తెలిపారు. ఓ మీడియా సంస్థ షార్ట్ సెల్లర్ సంస్థ యొక్క న్యూయార్క్ కార్యాలయాన్ని గుర్తించింది. కానీ, హిండెన్‌బర్గ్ వ్యవస్థాపకుడు నాథన్ ఆండర్సన్ని వారు ఫిజికల్‌గా కాంటాక్ట్ చేయలేకపోయారు.