Friday, November 22, 2024

Finance | సగానికి పడిపోయిన అదానీ ఆదాయం.. పది రోజలుగా షేర్​ మార్కెట్లలో భారీ పతనం!

బిలియనీర్ గౌతమ్ అదానీకి చెందిన స్టాక్స్​ రోజు రోజుకూ పతనమవుతున్నాయి. హిండెన్​బర్గ్​ రిపోర్ట్ అదానీ గ్రూప్ స్టాక్‌లలో పతనానికి కారణమయ్యింది. ఆ నివేదిక గురించి USలోని హిండెన్‌బర్గ్ రీసెర్చ్ అనే షార్ట్ సెల్లర్ సంస్థ పలు ఇంపార్టెంట్​ అంశాలను బహిర్గతం చేస్తోంది. అదానీ గ్రూప్ కంపెనీలు ఇప్పుడు $99 (8.14లక్షల కోట్లు) బిలియన్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌ను కలిగి ఉన్నాయి. ఇక.. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక కంటే ముందు $217 (ఒక కోటి 78లక్షల కోట్లు)బిలియన్లు అని ఓ​ ఫైనాన్స్​ వెబ్‌సైట్ ఫార్చ్యూన్ అంచనా వేసింది.

అదానీ గ్రూప్ 10 రోజుల్లో $118 (9.70 లక్షల కోట్లు) బిలియన్లను కోల్పోయింది, హిండెన్‌బర్గ్ గ్రూప్ స్టాక్ మానిప్యులేషన్, పన్నుల విధానాన్ని సక్రమంగా పాటించకపోవడం, మనీలాండరింగ్, పెరుగుతున్న అప్పుల గురించి ఆరోపణలు వచ్చినప్పటి నుండి అదానీ గ్రూప్​ షేర్లలో 50 శాతం క్షీణత కనిపిస్తోంది.

ఆసియాలో అత్యంత సంపన్నుడిగా ఉన్న అదాని స్థానం.. ఆ ప్లేస్​ నుంచి క్రమంగా పడిపోతూ వస్తోంది. ఈ వారం ఒక ప్రకటనలో పెట్టుబడిదారుల ప్రయోజనాలే ప్రధానమని, తన ఫ్లాగ్‌షిప్ కంపెనీ అయిన అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో రూ. 20,000 కోట్ల వాటా విక్రయాన్ని రద్దు చేసినట్లు ఆయన తెలిపారు. ఓ మీడియా సంస్థ షార్ట్ సెల్లర్ సంస్థ యొక్క న్యూయార్క్ కార్యాలయాన్ని గుర్తించింది. కానీ, హిండెన్‌బర్గ్ వ్యవస్థాపకుడు నాథన్ ఆండర్సన్​ని వారు ఫిజికల్​గా కాంటాక్ట్​ చేయలేకపోయారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement