న్యూఢిల్లి : నెల రోజులకు ముందు ప్రపంచ కుబేరుల జాబితాలో గౌతమ్ అదానీ 3వ స్థానంలో ఉన్నారు. అమెరి కాకు చెందిన షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ అదానీ గ్రూప్‌పై సంచలనాత్మక నివేదికను జనవరిలో విడుదల చేసింది. అదానీ గ్రూప్ స్టాక్‌మా ర్కె ట్‌లో షేర్ల విలువను కృతిమంగా పెంచుతూ అక్రమాలకు, అకౌం టింగ్‌లో మోసాలకు పాల్పడుతుం దని, డొల్ల కంపెనీలను సృష్టించి పన్ను ఎగవేతలకు , మనీ ల్యాండరింగ్‌కు పాల్పడిందని ఆరోపించింది. ఈ ఆరోపణలను అదానీ గ్రూప్ తీవ్రంగా ఖండించినప్పటికీ, ప్రభుత్వం అండగా ఉన్నప్పటికీ అప్పటి నుంచి స్టాక్ మార్కెట్‌లో అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు భారీగా పతనం అవుతున్నాయి. దీంతో సంపద పతనం అవుతూ వస్తోంది. 120 బిలియన్ డాలర్లతో ప్రపంచ కుబేరుల జాబితాలో ఉన్న ఆయన 2023 ఫిబ్రవరి 20 నాటికి 49.1 బిలియన్ డాలర్ల సంపదతో 25వ స్థానానికి పడిపోయారు
. బ్లూమ్‌బర్గ్ , ఫోర్బ్స్ రెండింటి జాబితాలోనూ ఆయన స్థానం 25గానే ఉంది. బ్లూమ్‌బర్గ్ రియల్ టైమ్ బిలియనీర్ల జాబితాలో అదానీ సంపదను 49.1 బిలియన్ డాలర్లుగా పేర్కొంది. ఫోర్బ్స్ అదానీ సంపదను 48 బిలియన్ డాలర్లుగా పేర్కొంది. చైనాకు చెందిన జాంగ్ యి మింగ్ అనే వ్యాపార వేత్త 49.5 బిలియన్ డాలర్లు, అమెరికాకు చెందిన ఫిల్‌నైట్ అండ్ ఫ్యామిలీ సంపద 47,4 బిలియన్ల కంటే అదానీ వెనుకబడి ఉన్నారు. హిండెన్‌బర్గ్ నివేదిక తరువాత గ్రూప్ కంపెనీల సంపదతో పాటు, అదానీ వ్యక్తిగత సంపద కూడా 71 బిలియన్ డాలర్లకు పడిపోయింది. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో ఉన్న 500 మంది బిలియనీర్లలో అత్యంత వేగంగా సంపద తరిగిపోయిన వారిలో అదానీ మాత్రమే ఉన్నారు. నెల రోజుల క్రితం ప్రపంచంలోనే అత్యధిక ధనవంతుల జాబితాలో 3వ స్థానంలో ఉన్న అదానీ ఫిబ్రవరి 20 నాటికి 25వ స్థానానికి పడిపోయారు. స్టాక్‌మార్కెట్‌లో లిస్టయిన 7 అదానీ గ్రూప్ కంపెనీలు హిండెన్‌బర్గ్ నివేదిక వచ్చిన తరువాత 10 లక్షల కోట్లకు పైగా నష్టపోయాయి. అదానీ ఆసియాలోనే అత్యధిక ధనవంతుడిగా ఉన్న రికార్డును కూడా కోల్పో యారు. ఈ స్థానాన్ని ముఖేష్ అంబానీ కైవసం చేసుకున్నారు. ఆయన 83.6 బిలి యన్ డాలర్ల సంపదతో ప్రపంచ కుబేరుల జాబితాలో 11వ స్థానంలో ఉన్నారు.
1500 కోట్లు రుణం చెల్లించిన అదానీ
అదానీ పోర్ట్స్ అండ్ ఎస్‌ఈజడ్ 15 వందల కోట్ల రుణాన్ని సోమవారం నాడు చెల్లిం చింది. హిండెన్‌బర్గ్ నివేదికతో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న అదానీ గ్రూప్ ఇన్వెస్టర్లలో విశ్వాసం కల్పించేందుకు అనేక చర్యలు తీసుకుం టోంది. అందులో భాగంగానే సమయానికే రుణాన్ని చెల్లించింది. ఎస్‌బీఐ మ్యూచువల్ పండ్స్‌కు ఈ మొత్తాన్ని చెల్లించినట్లు అదానీ గ్రూప్ ఒక ప్రకటనలో తెలిపింది. కమర్షియల్ పేపర్స్‌కు మార్చిలో చెల్లించాల్సిన 1000 కోట్లు కూడా చెల్లిస్తామని తెలిపింది. ఈ రుణాలను క్యాష్ బ్యాలెన్స్, బిజినెస్ కార్యకలాపాల నుంచి వచ్చిన ఆదాయంతో చెల్లించినట్లు తెలిపింది. ఇన్వెస్టర్లలోనూ, క్యాపిటల్ మార్కెట్లో కంపె నీ పట్ల విశ్వాసం పెంచే చర్యల్లో భాగంగానే ఈ రుణాలను షెడ్యూల్ ప్రకారమే చెల్లిస్తున్నామని అదానీ గ్రూప్ ప్రతినిధి ఒకరు తెలిపారు. 2022 సెప్టెంబర్ నాటికి అదానీ గ్రూప్‌కు 2.26 లక్షల కోట్ల అప్పు ఉంది. 31,646 కోట్ల ఖాతాల్లో నగదు నిల్వలు ఉన్నాయి.
అప్పు ఇస్తాం… బ్యాంక్ ఆఫ్ బరోడా…
హిండెన్‌బర్గ్ నివేదిక దెబ్బకు అదానీ గ్రూప్ షేర్లు భారీగా పతనం అయ్యాయి. అదానీ కంపెనీలో పెట్టుబడి పెట్టిన సంస్థలు, వ్యక్తులు తీవ్రంగా నష్టపోయారు. ఇంకా అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు కోలుకోలేదు. అదానీ గ్రూప్ కంపెనీలకు రుణాలు ఇచ్చిన బ్యాంక్‌లు, ఎల్‌ఐసీ పై ఇటీవల తీవ్ర స్థాయిలో చర్చలు జరిగాయి. అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు సైతం అదానీ గ్రూప్ రేటింగ్స్‌ను తగ్గించాయి. ఈ నేపథ్యంలో బ్యాంక్ ఆఫ్ బరోడా సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ చద్దా మాత్రం అదానీ గ్రూప్‌కు రుణాలు కొనసాగుతాయని ప్రకటించారు. దీనిపై ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పూచీకత్తు ప్రమాణాలను సరిగా పాటిస్తే రుణాలు ఇచ్చేందుకు అభ్యంతరం లేదని చెప్పారు. అదానీ గ్రూప్ షేర్లలో ఒడిదొడుకులను తాను పట్టించుకోనని స్పష్టం చేశారు. బ్యాంక్ ఆఫ్ బరోడా ఇప్పటి వరకు అదానీ గ్రూప్‌కు ఎంత రుణం ఇచ్చింది ఆయన వెల్లడించలేదు. ముంబైలోని ధారావి మురికివాడ పునరుద్ధరణ ప్రాజెక్ట్‌ను 5వేల కోట్లకు అదానీ గ్రూప్ దక్కించుకున్న విషయం తెల్సిందే. ఈ ప్రాజెక్ట్‌కు అదానీ గ్రూప్‌కు బ్యాంక్ ఆఫ్ బరోడా రుణం ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తోందని చద్దా చెప్పా రు. అదానీ కంపెనీలకు కొన్ని పరిమితులకు లోబడే రుణాన్ని మంజూరు చేస్తామ న్నారు. హిండెన్‌బర్గ్ దెబ్బకు ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని నింపేందుకు 500 మిలియన్ డాలర్ల రుణాలను రీఫైనాన్స్ చేయడానికి అదానీ గ్రూప్ సిద్ధమైంది. ఇప్పుడు తాజాగా బ్యాంక్ ఆఫ్ బరోడా రుణాలు ఇస్తామని ముందుకు రావడం విశేషం.