Friday, November 15, 2024

సిటీలో పెట్ వాక్సినేషన్ డ్రైవ్.. ప్ర‌రంభించిన నటి వరలక్ష్మి శరత్‌కుమార్

హైదరాబాద్ : హెర్మియోన్ డంకన్ రెడ్డి ఫౌండేషన్ (హెచ్‌డిఆర్‌ఎఫ్) ఆధ్వర్యంలో ఇవ్వాల (శుక్రవారం) పెట్ వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను ప్ర‌రంభించింది సినీనటి, జంతు ప్రేమికురాలు వరలక్ష్మి శరత్‌కుమార్. ఈ ఉచిత వ్యాక్సినేషన్ కార్యక్రమంలో కొంత మంది పెట్ పేరెంట్స్ వాల్ల‌ పెంపుడు జంతువులతో పాల్గొన్నారు. హెచ్‌డిఆర్‌ఎఫ్ అనేది ఒక యానిమ‌ల్- ఫ్రెండ్లీ ఆర్గ‌నైజేష‌న్ (జంతు-స్నేహపూర్వక సంస్థ), ఇటీవల హైదరాబాద్‌లో ఒక సెంట‌ర్ ను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది. ఆసియాలో హెచ్‌డిఆర్‌ఎఫ్ సంస్థ మొదటి సెంట‌ర్ కానుంది.

ఈ కార్యక్రమంలో భాగమైన వరలక్ష్మి శరత్‌కుమార్ తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ.. “HDRF ద్వారా ఈ పెంపుడు-స్నేహపూర్వక చొరవ చూడటం చాలా బాగుంది. అన్ని జీవరాశుల పట్ల శ్రద్ధ, సానుభూతి క‌లిగి ఉండ‌టం అవ‌స‌రం. ఇలాంటి వ్యాక్సినేషన్ డ్రైవ్స్ కారణంగా జంతువులను ఆరోగ్యవంతంగా, వ్యాధి రహితంగా మార్చడంలో సాధ్యం అవుతుంది.” అని చెప్పారు.

ఇక‌ రానున్న మూడు రోజుల్లో 5,000 కుక్కలకు టీకాలు వేయాలని నిర్ణ‌యించుకున్న‌ట్టు హెచ్‌డిఆర్‌ఎఫ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్రీరెడ్డి తెలిపారు. జంతువులకు టీకాలు వేయడానికి రెండు మొబైల్ వ్యాన్‌లను ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. “మునిసిపల్ అధికారులు, మా శ్రేయోభిలాషుల సహకారంతో ఈ కార్యక్రమం కొనసాగుతుంది” అని శ్రీరెడ్డి తెలిపారు. సిటీజ‌న్స్ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. పెంపుడు జంతువులకు టీకాలు వేయించాల‌నుకునే వారు ఈ నెంబ‌ర్ ని 9100873829ని సంప్రదించవచ్చు అని ఆమే తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement