బెంగళూరు: కర్నాటకలో ఒక్కలిగ సామాజిక వర్గాని కి చెందిన అసెంబ్లి సీట్లను జనతాదళ్ (ఎస్) నుం చి కైవసం చేసుకోవడానికి బీజేపీ సినీనటి సుమలతను రంగంలోకి దింపనున్నది.ఆమె కన్నడ సూపర్‌స్టార్, ఒక్కలిగ సామాజికవర్గంనాయకుడు అంబరీష్ భార్య. అంబరీష్ కన్నుమూయడంతో ఆమె మాండ్య లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.మే నెలలో జరిగే అసెంబ్లి ఎన్నికల్లో ఆమెను మాండ్య అసెంబ్లి స్థానానికి పార్టీ అభ్యర్ధినిగా ఎంపిక చేయాలని బీజేపీ నిర్ణయించిం ది. దక్షిణ కర్నాటక ప్రాంతంలో మొత్తం 57 అసెంబ్లి స్థానాలున్నాయి .వీటిలో కనీసం 20 సీట్లయినా బీజేపీ గెల్చేట్టు వ్యూహం రూపొందించాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదేశించినట్టు తెలుస్తోంది. ఇందు కోసం సుమలతను ప్రచార సారథిగా చేయాలని నిర్ణం ుుంచినట్టు తెలియవచ్చింది.
జేడీఎస్ లేకపోతే …: కర్నాటకలో అసెంబ్లి ఎన్నికల బరిలో జనతాదళ్(ఎస్)లేకపోతే బీజేపీ మెజారిటీ సీట్లను కొల్లగొట్టుకుని పోయే ప్రమాదం ఉంది. కాంగ్రెస్ నాయకులు సిద్ధరామయ్య,డికె శివకుమార్ పార్టీ అధిష్టానానికి ఇదే విషయాన్నిస్పష్టం చేసినట్టు తెలుస్తోం ది. మాజీ సిఎం సిద్ధరామయ్య నేతృత్వంలో కాంగ్రెస్ 2013లో కన్నా,2018 లో ఎక్కువ శాతం ఓట్లను సాధిం చింది. కానీ, సీట్లు మాత్రం కోల్పోయింది. జనతాదళ్ (ఎస్) కలిసి లేకపోవడం వల్లనే ఇలా జరిగిందని కాంగ్రె స్ నాయకులు పేర్కొంటున్నారు.