హైదరాబాద్ – కన్నడ నటి శోభిత ది ఆత్మహత్యేనని తెలిపారు మాదాపూర్ డీసీపీ వినీత్. ఇంట్లో సేకరించిన ఆధారాలతో సూసైడ్ గా భావిస్తున్నామన్నారు. ఈ కేసు గురించి ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ… పోస్టుమార్టం రిపోర్టులో కూడా ఎలాంటి అనుమానాలు వ్యక్తమవలేదన్నారు. ఇక సూసైడ్ నోట్ లభించలేదని, ఆత్మహత్యకు ముందు ఎక్కడైనా డైరీలో రాసుకుందా, ఎవరికైనా మెసేజ్ చేసిందా అని దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఇక భార్యాభర్తల మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు. ఇక శోభిత పేరెంట్స్ కూడా ఎలాంటి ఫిర్యాదు చేయలేదని పేర్కొన్నారు.
కాగా, కన్నడ నటి శోభిత ఆత్మహత్య కేసు ఇప్పుడు చర్చనీయంశంగా మారింది. సూసైడ్ కి మూడు రోజుల ముందు గోవాకు వెళ్లివచ్చారు శోభిత, ఆమె భర్త సుధీర్. శోభిత లాస్ట్ కాల్ వాళ్ళ అక్కతో మాట్లాడినట్లు గుర్తించారు పోలీసులు. అయితే ఆత్మహత్య గల కారణాలు తెలియవని వివరణ ఇచ్చారు ఆమె భర్త. ఇక శోభిత మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయిన తర్వాత కుటుంబ సభ్యులకు మృతదేహం అప్పగించారు గచ్చిబౌలి పోలీసులు. బెంగళూరులో అంత్యక్రియల నిర్వహించేందుకు ఆమె పేరేంట్స్ ఆమె మృతదేహాన్నిఅంబులెన్స్ తరలించారు.