సీరియల్స్ తో పాటు సినిమాల్లో నటించిన నటి ప్రియాంక నల్కారి సీక్రెట్‌గా పెళ్లి చేసుకుంది. ప్రేమికుడు రాహుల్‌తో కలిసి సింపుల్‌గా ఏడడుగులు నడిచింది. మలేషియాలోని మురుగన్ ఆలయంలో వీరి వివాహం జరిగింది. అనంతరం #JustMarried అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ చేసింది. అలాగే తన స్టేటస్‌లో కూడా ఒక ఫొటో, వీడియోను కూడా పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పెళ్లి ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వీటిని చూసి అభిమానులు, ఫాలోవర్లు, నెటిజన్లు షాక్ అవుతున్నారు. అదే సమయంలో కొత్త దంపతులకు శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతున్నారు. కాగా ప్రియాంక టాలీవుడ్ ప్రేక్షకులకు బాగా సుపరిచితమే. 2010లో విడుదలైన శర్వానంద్ ‘అందరి బంధువయా’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆతర్వాత కొద్దిగా గ్యాప్ తీసుకుంది. ఇక జబర్దస్త్ లో గెటప్ శ్రీనుతో కలిసి కొన్ని స్కిట్లు కూడా చేసింది. అలాగే ఈటీవీ ప్లస్ సినిమా చూపిస్తా మామలో యాంకర్‌గా కూడా మెప్పించింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement