తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్న నటి కస్తూరికి పెద్ద షాక్ తగిలింది. కస్తూరిని హైదరాబాద్లో అరెస్ట్ చేసిన పోలీసులు.. చెన్నైకి తీసుకెళ్లి… చెన్నై ఎగ్మోర్ కోర్టులో హాజరుపరిచారు. ఈ క్రమంలో కోర్టు ఆమెకు ఈ నెల 29 వరకు రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు కస్తూరిని చెన్నైలోని పుజల్ సెంట్రల్ జైలుకు తరలించారు.
ఓ రాజకీయ సభలో మాట్లాడిన కస్తూరి.. తెలుగు వారు అంతఃపుర మహిళలకు సేవ చేసేందుకు వచ్చారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.