Sunday, January 5, 2025

Hema: న‌టి హేమ‌కు ఊర‌ట..

బెంగుళూరు హైకోర్టులో తెలుగు నటి హేమకు ఊరట ల‌భించింది. గత ఏడాది మేలో బెంగళూరులోని ఓ ఫామ్‌హౌస్‌లో జరిగిన రేవ్‌ పార్టీలో నటి హేమ డ్రగ్స్‌ సేవించడం, రైడ్‌ సమయంలో తప్పుడు పేర్లు, ఫోన్‌ నంబర్లు ఇవ్వడం, రేవ్‌ పార్టీలో నిషేధిత పదార్థాల గురించి ముందస్తుగా అవగాహన కల్పించడం, వీడియోస్టేట్‌మెంట్లు ఇవ్వడం ద్వారా దర్యాప్తును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించడం వంటి అభియోగాలు పోలీసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

అనంత‌రం ఆమెకు బెయ‌ల్ ల‌భించింది. ఇక ఈ కేసు విచారణపై స్టే కోరుతూ హేమ దాఖలు చేసిన మధ్యంతర దరఖాస్తు పరిశీలించిన జస్టిస్ అనుమతిస్తూ నేడు ఉత్తర్వులు జారీ చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement