Thursday, November 21, 2024

Vijay Antony: నటుడు విజయ్‌ ఆంటోనీ కుమార్తె ఆత్మహత్య

చెన్నై: నటుడు, సంగీత దర్శకుడు, బిచ్చగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన విజయ్‌ ఆంటోని ఇంట్లో తీవ్ర విషాదం నెలకొన్నది. ఆయన కుమార్తె మీరా ఆంటోని ఆత్మహత్య చేసుకున్నది. మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు చెన్నైలోని డీడీకే రోడ్‌లోని తమ నివాసంలో ఆమె బలవన్మరణానికి పాల్పడింది. ఉదయాన్నే ఇంట్లో వాళ్లు చూసేసరికి ఆమె ఉరేసుకుని కనిపించగా.. వెంటనే హాస్పిటల్​కు తరలించారు. కానీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

తీవ్రమైన ఒత్తిడితోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. చెన్నైలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఆమె 12వ తరగతి చదువుతోంది. విజయ్ నిర్మాత అయిన ఫాతిమాను 2006లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. ఇప్పుడు పెద్ద కుమార్తె ఆత్మహత్య చేసుకోవడంతో ఆయన కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement