సీనియర్ నటుడు శరత్‌కుమార్ తీవ్ర అస్వస్థకు గురైయ్యారు. డయేరియాతో డిప్రెషన్‌కు గురైన ఆయన ప్రస్తుతం చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆయన భార్య రాధిక, కూతురు వరలక్షి శరత్‌కుమార్ హస్పటల్‌కు చేరుకున్నట్లు తెలుస్తుంది. అయితే.. ఆయన ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులు నుంచి ఎలాంటి స్పందన లేదు. అలాగే ఆసుపత్రి వర్గాలు కూడా ఎలాంటి మెడికల్ బులిటెన్‌ను విడుదల చేయలేదు. ఈ విషయం తెలిసి తమిళ సినీ వర్గాల్లో టెన్షన్ మొదలైంది. ఆయన త్వరగా కోలుకొని ఇంటికి తిరిగి రావాలని సినీ ప్రముఖులు కోరుకుంటున్నారు.
అయితే కంగారు పడవలసిన అవసరం లేదని ఆయన సన్నిహితులు అంటున్నారు. మరోవైపు ఇప్పటివరకు ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఇటు కుటుంబ సభ్యులు కానీ, ఆసుపత్రి వర్గాల నుంచి ఎలాంటి మెడికల్ బుల్లెట్ ను విడుదల చేయలేదు. శరత్‌కుమార్ సినీ ప్రస్థానం టాలీవుడ్‌లోనే మొదలయింది. 1986లో ‘సమాజంలో స్త్రీ’ అనే సినిమాతో ఆయన కెరీర్‌ను ప్రారంభించారు. ఆ తరువాత రెండేళ్లకు కన్ సిముట్టుమ్ నేరమ్ సినిమాతో కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాకు ప్రొడ్యూసర్ కూడా శరత్‌కుమారే. ఈ సినిమా శరత్‌కుమార్‌కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ సినిమా తర్వాత సపోర్టింగ్ ఆర్టిస్టుగా తెగ బిజీ అయ్యారు. ఏడాదికి పది సినిమాలు చేస్తూ తీరిక లేకుండా షూటింగ్‌లు చేసేవారు. ఈ క్రమంలోనే హీరోగా మారి పలు సినిమా చేశారు. కేవలం నటుడిగానే కాకుండా నిర్మాతగా, దర్శకుడిగా, సింగర్‌గా పలు విభాగాల్లో పనిచేసి కోలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటి వరకు ఈయన 130 సినిమాల్లో పైగా నటించారు.