ప్రముఖ రచయిత, దర్శకుడు నంద్యాల రవి కరోనాతో బాధపడుతున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కష్టకాలంలో ఉన్న ఆయనకు హాస్యనటుడు సప్తగిరి సకాలంలో సాయమందించి అందరి హృదయాలను గెలుచుకున్నాడు. నంద్యాల రవి వైద్య ఖర్చుల కోసం అతడు రూ.లక్ష ఆర్థిక సాయం అందించాడు.
కరోనా చికిత్సలో భాగంగా నంద్యాల రవికి ఆస్పత్రి బిల్లు రూ. 6-7 లక్షలు వచ్చిందట. డైరెక్టర్ కుటుంబానికి అంత పెద్ద మొత్తాన్ని భరించే శక్తి లేదు. సప్తగిరి తన మానవతా సాయంగా లక్ష అందించడంపై ప్రశంసలు కురుస్తున్నాయి. కాగా గత ఏడాది తెలుగు సినీ కార్మికులకు ఉపశమనం పునరావాసం కల్పించేందుకు మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలోని కరోనా క్రైసిస్ ఛారిటీకి సప్తగిరి రూ.2 లక్షలు అందించాడు.