క్లౌడ్ కిచెన్ ఫార్మాట్లో పనిచేస్తున్న షోయు.. స్విగ్గీతో కలిసి జపనీస్ వంటకాలతోపాటు పాన్ ఏషియన్ వంటకాలను వినియోగదారులకు అందించనుంది. ఈ మేరకు స్విగ్గీ షోయు ఒప్పందం కుదుర్చుకున్నాయి. టాలీవుడ్ హీరో నాగచైతన్య తన క్లౌడ్ కిచెన్ బ్రాండ్ షోయు.. స్విగ్గీతో భాగస్వామ్యం గురించి తెలుపుతూ.. పర్యావరణ ప్రభావంపై తగిన శ్రద్ధపెట్టడం ద్వారా స్థిరమైన ప్యాకేజింగ్ మెటీరియల్స్ ఉపయోగించి ఆహారం ప్యాక్ చేయనున్నామన్నారు. స్విగ్గీ విశ్వసనీయమైన డెలివరీ భాగస్వాముల నెట్ వర్క్ ద్వారా వినియోగదారులకు కావాల్సిన ఆహారా న్ని నాణ్యతతో అందిస్తామన్నారు.
షోయు నిజిరిస్, థాయ్ కర్రీస్, డిమ్ సమ్స్, బావోస్, సుషీ, సూప్స్, రైస్, నూడుల్స్ తదితర విస్తృత పాన్ ఆసియా వంటకాలను అందిస్తామన్నారు. హైదరాబాద్‌లోని స్విగ్గీ వినియో గదారులు స్విగ్గీయాప్లో షోయు ద్వారా డిస్కౌంట్, ప్రత్యేక ఆఫర్లను పొందవచ్చన్నారు. ఆహారాన్ని తయారుచేయడం నుంచి డెలివరీ వరకు ప్రతిదశ లోనూ కొవిడ్ నిబంధనలను సేఫ్ ప్రొటోకాల్స్‌ను పాటిస్తామని పేర్కొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..