దూరదర్శన్‌లో చిన్నా పెద్ద అందరినీ అలరించిన ‘రామాయణ్’ ధారావాహికలో రావణుడిగా నటించిన అరవింద్ త్రివేది కన్నుమూశారు. ఆయన వయసు 82 సంవత్సరాలు. గుండెనొప్పితో మంగళవారం రాత్రి ఆయన మరణించారు. త్రివేది మరణవార్తను ఆయన సహ నటుడు సుశీల్ లహిరి ఈ తెల్లవారుజామున ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. ఇది విచారకరమైన వార్త అని, తమ ప్రియమైన అరవింద్ భాయ్ ఇక లేరని ఆ పోస్టులో పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.
‘రామాయణ్’ సీరియల్ 1980లో ఎంత పాపులర్ అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రామాయణ్ సీరియల్‌ను దూరదర్శన్ పునఃప్రసారం చేసిన విషయం తెలిసిందే.