సీనియర్ నటి, కాంగ్రెస్ నేత నగ్మా కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కొద్దిరోజుల క్రితం ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్నానని, తాజాగా కోవిడ్ టెస్ట్ చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఆమె ట్వీట్ చేశారు. అందరూ జాగ్రత్తగా ఉండాలని, ఫస్ట్ డోస్ తీసుకున్నామన్న ధైర్యంతో జాగ్రత్తలు పాటించడం మానొద్దని ఆమె సూచించారు. ప్రస్తుతం ఇంట్లోనే క్వారంటైన్ పాటిస్తున్నట్లు తెలిపారు. ముంబైలో ఏప్రిల్ 2న ఫస్ట్ డోస్ తీసుకున్నానని, ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ తీసుకోగానే జ్వరం వచ్చినట్టు అయిందని, తలనొప్పి.. జలుబు, దగ్గు మొదలైందని నగ్మా తెలిపారు. కళ్లు కూడా కొద్దిసేపు మంటలుగా అనిపించాయని, అయితే.. కొద్దిసేపటికి ఆ దుష్ప్రభావాలన్నీ తొలగిపోయాయని నగ్మా ట్వీట్లో వివరించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement