Thursday, November 21, 2024

న‌టుడు అబ్బాస్ కి స‌ర్జ‌రీ

కొద్దిరోజుల క్రితం న‌టుడు అబ్బాస్ బైక్ యాక్సిడెంట్ కి గుర‌య్యారు. దాంతో ఆయ‌న మోకాలికిగాయ‌మైంది. కాగా ఆ గాయం ఇప్పుడు ఇబ్బంది పెడుతుండ‌టంతో డాక్ట‌ర్స్ స‌ర్జ‌రీ చేయాల‌ని తెలిపార‌ట‌. దాంతో వైద్యుల సలహా మేరకు ఆయన మోకాలి సర్జరీ చేయించుకుంటున్నారనేది విశ్వసనీయ సమాచారం. అబ్బాస్ ఆసుపత్రిలో ఉన్న ఫోటో సోషల్ మీడియాలో రావడంతో అది కాస్తా వైరల్ గా మారింది. అభిమానుల ఆందోళనకు కారణమైంది. ప్రేమదేశం మూవీతో అబ్బాస్ వెండితెరకు పరిచయమయ్యారు.

ఆ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో అబ్బాస్ కి హీరోగా పలు ఆఫర్స్ వచ్చాయి. ఒక దశలో లవర్ బాయ్ ఇమేజ్ ని అబ్బాస్ ఎంజాయ్ చేశాడు. అయితే ఆయన కెరీర్ త్వరగా ఫేడ్ అవుట్ అయ్యింది. సెకండ్ హీరో ఛాన్సులకు పరిమితమయ్యాడు. 2015 తర్వాత ఆయన సిల్వర్ స్క్రీన్ కి దూరమయ్యాడు. రెండు తమిళ సీరియల్స్ లో సైతం నటించాడు. అబ్బాస్ భార్య ఇరుమ్ అలీ ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్. కుటుంబంతో పాటు అబ్బాస్ విదేశాల్లో సెటిల్ అయినట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement