Tuesday, November 26, 2024

20 నెలల కనిష్టానికి యాక్టివ్‌ కేసులు.. 24 గంటల్లో 7,081 కేసులు

న్యూఢిల్లి : భారత్‌లో కరోనా కేసులు తగ్గుముఖంపడుతున్నాయి. దేశంలోని క్రియాశీల కేసుల సంఖ్య 20 నెలల కనిష్ఠానికి పడిపోయింది. గడిచిన 24 గంటల్లో శనివారం ఉదయం 8 నుంచి ఆదివారం ఉదయం 8 గంటల వరకు 7,081 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా 264 మంది కరోనా కారణంగా చనిపోయారు. శనివారంతో పోలిస్తే.. పాజిటివ్‌ కేసులు తగ్గాయి.

మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య ఇప్పటి వరకు 3,47,33,194కు చేరుకున్నాయి. ఇంతవరకు 4,77,422 మందిని కరోనా బలిగొంది. 3,47,40,275 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశ వ్యాప్తంగా యాక్టివ్‌ కేసుల సంఖ్య 83,913 (0.24 శాతం) ఉంది. మార్చి 2020 తరువాత.. యాక్టివ్‌ కేసుల్లో ఇదే అత్యల్పం. దేశ వ్యాప్తంగా శనివారం 12,11,977 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. శనివారం 76,54,466 మంది టీకా తీసుకున్నారు. దీంతో మొత్తం వ్యాక్సినేషన్ల సంఖ్య 137,46,13,252కు చేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement