బక్రీద్ సందర్భంగా గో-వధలు జరగకుండా చూడాలని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు (గురువారం) ఆదేశాలు జారీ చేసింది. గో-వధలు జరగకుండా చూడాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా… ఈ నేపథ్యంలో హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
అక్రమంగా గోవులను చంపితే చర్యలు తప్పవని హైకోర్టు స్పష్టం చేసింది. ఆవులను తరలించకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని తెలిపింది. జంతు వధ చట్టాన్ని అమలు చేస్తున్నామని… మూడు కమిషనరేట్ల పరిధిలో 150 చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. గోవుల తరలింపుపై ఇప్పటికే 60 కేసులు నమోదు చేశామన్నారు.