Saturday, November 23, 2024

నాణ్యతలేని బొమ్మల విక్రయాలపై చర్యలు.. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లకు నోటీసులు

దేశంలో బొమ్మలు విక్రయిస్తున్న ప్రముఖ ఔట్‌లెట్‌లలో హావ్లీుస్‌, ఆర్చీస్‌ సహా ప్రధాన రిటైల్‌ దుకాణాల నుంచి గతనెలలో 18,600 ఆట బొమ్మలను బీఐఎస్‌ స్వాధీనం చేసుకున్నది. నాణ్యత సరిగా లేనందున వీటిని జప్తు చేసినట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. మరోవైపు ఆటబొమ్మల నాణ్యత నియంత్రణ ఆదేశాలను ఉల్లంఘించినందుకు మూడు ప్రధాన ఇ-కామర్స్‌ సంస్థలు అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, స్నాప్‌డీల్‌కు వినియోగదారుల రక్షణ నియంత్రణ సంస్థ నోటీసులు జారీచేసింది. బీఎస్‌ఐ ప్రమాణాలకు అమునుగుణంగా లేని బొమ్మల విక్రయాలపై దేశీయ తయారీ దారుల నుంచి మాకు ఫిర్యాదులు అందాయి. మేం గత నెలలో 44 సోదాలు నిర్వహించాం.

- Advertisement -

ప్రధాన రిటైల్‌ దుకాణాల నుంచి 18,600 బొమ్మలను స్వాధీనం చేసుకున్నాం అని బీఐఎస్‌ డైరెక్టర్‌ జనరల్‌ ప్రమోద్‌ కుమార్‌ తివారి వెల్లడించారు. విమానాశ్రయాలు, మాల్స్‌లో ఉన్న హ్యావ్లీుస్‌, ఆర్చీస్‌, డబ్య్లుహెచ్‌ స్మిత్‌, కిడ్స్‌ జోన్‌, కోకోకార్ట్‌తోసహా రిటైల్‌ దుకాణాల్లో తనిఖీలు నిర్వహించినట్లు తివారీ తెలిపారు. బీఐఎస్‌ క్వాలిటీ మార్కు లేకుండా బొమ్మలు విక్రయిస్తున్నందుకు అమెజాన్‌, ఫ్లిప్‌కార్జ్‌, స్నాప్‌డీల్‌కు నోటీసులు ఇచ్చామని సీసీపీఏ చీఫ్‌ నిధి ఖరే మీడియా సమావేశంలో తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement