న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 ప్రకారం రాష్ట్రంలో జాతీయ ప్రాముఖ్యత కలిగిన విద్యాసంస్థలఅభివృద్ధికి చర్యలు చేపట్టినట్టు కేంద్రప్రభుత్వం వెల్లడించింది. నరసరావుపేటవైఎస్సార్సీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రిధర్మేంద్ర ప్రధాన్ సోమవారం బదులిచ్చారు. ఐఐటీ (తిరుపతి), ఎన్‌ఐటీ (తాడేపల్లి గూడెం), ఐఐఎం(విశాఖపట్నం), ఐఐఎస్‌ఈఆర్ (తిరుపతి), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్‌ఫర్‌మేషన్ టెక్నాలజీ డిజైన్‌అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ (కర్నూలు) సహా నాలుగు సంస్థలు 2015–16 నుంచి పని చేస్తున్నాయని ఆయన తెలిపారు.
విశాఖపట్నంలోని పెట్రోలియంవిశ్వవిద్యాలయం 2016–17లో కార్యకలాపాలు ప్రారంభించగా, అనంతపూర్‌లోని సెంట్రల్ యూనివర్శిటీ 2018–19లో ప్రారంభమైందని తెలిపారు. అన్ని సౌకర్యాలతో ఏర్పాటు చేసినగుంటూరులోని ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 2014 నుంచి పని చేస్తోందని ధర్మేంద్ర ప్రదాన్ తెలిపారు. ఇండియన్‌కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ (ఐసీఏఆర్) గుర్తింపు పొందిన ఆచార్య ఎన్జీ రంగావ్యవసాయ విశ్వవిద్యాలయం నాణ్యమైన వ్యవసాయ విద్యను అందిస్తున్నట్లు కేంద్రమంత్రి జవాబులో పేర్కొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.