Saturday, November 23, 2024

యాక్షన్​, కట్​ వరకే ఆ బంధాలు.. ఆ తర్వాత నా లోకమే వేరు అంటున్న రాధికా ఆప్టే

బాలీవుడ్‌లో మోస్ట్ బోల్డ్ యాక్టెర‌స్‌గా పేరు తెచ్చుకుంది రాధికా ఆప్టే. ఇప్పటికీ రాధికా ఆప్టే అంటే.. కుర్రాళ్ల గుండెల్లో వెయ్యి మైళ్ల వేగంగా గుర్రాలు పరుగెడతాయి. అయితే.. సినీరంగంలోని కృత్రిమ అనుబంధాలు, అవకాశవాద స్నేహాలు తనకు నచ్చవని అంటోంది ఈ అమ్మ‌డు. కెరీర్‌ ఆరంభం నుంచి డిఫ‌రెంట్ రోల్స్‌తో హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న ఈ భామ ప్రస్తుతం లండన్‌లో రెస్ట్ తీసుకుంటోంది. సినీ ఇండ‌స్ట్రీకి చెందిన హంగూ ఆర్భాటాలకు చాలా దూరంగా ఉంటూ.. సేదతీరడాన్ని తాను ఎంతగానో ఇష్టపడతానని చెప్పింది. ‘కేవలం వృత్తిపరంగానే నేను సినీరంగంతో కలిసి ప్రయాణం చేస్తాను. వ్యక్తిగతంగా ఆ వాతావ‌రణంలో ఏమాత్రం ఇమడలేను’’ అంటూ వెల్లడిస్తోంది ఈ బ్యూటిఫుల్​ భామ.

కాగా, కాలక్షేపం కోసం కబుర్లు చెప్పుకోవడం, తమ గొప్పతనాన్ని ఇతరుల ముందు ప్రదర్శించే ధోరణి పరిశ్రమలో ఎక్కువగా కనిపిస్తోందని, అలాంటివి తన వ్యక్తిత్వానికి సరిపడవు అని చెబుతోంది. అందుకే షూటింగ్ కంప్లీట్​ అయిన వెంటనే తనకు ఇష్టమైన ప్రదేశాలకు వెళ్లిపోతానని, సినీ ప్రపంచాన్ని మరిచిపోయి తనకు నచ్చిన పనులు చేస్తానని తెలియజేస్తోంది. ప్రస్తుతం ఆమె హిందీలో ఫొరెన్సిక్‌, విక్రమ్‌వేదా చిత్రాల్లో నటిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement