Friday, November 22, 2024

మా బిడ్డ‌కు స్వాగ‌తం ప‌లుకుతున్నాం-సోన‌మ్ క‌పూర్ పోస్ట్

బాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు అనీల్ క‌పూర్ తాత అయ్యాడు.ఆయ‌న కుమారై..బాలీవుడ్ హీరోయిన్ సోన‌మ్ క‌పూర్ పండ‌టి మ‌గ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది . ఈ విషయాన్ని సోన‌మ్ క‌పూర్ ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలియజేసింది. ఈ రోజు మగ బిడ్డ తమ మధ్యకు వచ్చాడని… బిడ్డకు స్వాగతం పలుకుతున్నామని తెలిపింది. ఈ క్రమంలో తమకు సహకరించిన డాక్టర్లు, నర్సులకు కృతజ్ఞతలు తెలియజేసింది. తమకు అండగా నిలిచిన స్నేహితులు, కుటుంబసభ్యులకు ధన్యవాదాలు తెలిపింది. ఇది కేవలం ఒక ప్రారంభం మాత్రమేనని.. తమ జీవితాలు ఎంతో మారుతాయని చెప్పింది. ఢిల్లీకి చెందిన ఆనంద్ అహూజాతో రెండేళ్ల పాటు డేటింగ్ చేసిన తర్వాత 2018లో ఆయనను సోనమ్ పెళ్లి చేసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement