బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది నటి సోమి అలీ.ఈమె పాకిస్తాన్ నటి. 90వ దశకంలో అనేక బాలీవుడ్ చిత్రాల్లో నటించింది.సల్మాన్ ఖాన్, సోమి అలీ బులంద్ అనే చిత్రంలో నటించారు. ప్రస్తుతం సోమి అలీ ఎన్జీవోని నడిపిస్తున్నారు సల్మాన్ ఖాన్ తో ఎక్కువ కాలం ప్రేమలో గడిపిన హీరోయిన్ సోమి అలీ అనే చెప్పాలి. దాదాపు 8 ఏళ్ల పాటు వీరిద్దరూ డేటింగ్ చేశారు. అన్ని రోజులు సల్మాన్ ఖాన్ తో రిలేషన్ పంచుకున్న సోమి అలీ తాజాగా అతడిపై అనేక ఆరోపణలతో బాంబు పేల్చింది. సల్మాన్ ఖాన్ తో గడిపిన ఆ 8 ఏళ్ళు తన జీవితంలోనే వరస్ట్ ఫేజ్ అని పేర్కొంది. సల్మాన్ ఖాన్ పై సంచలన ఆరోపణలు చేస్తూ సుదీర్ఘమైన ఇంస్టాగ్రామ్ పోస్ట్ పెట్టింది. సల్మాన్ ఖాన్ కి నీకు మధ్య ఏం జరిగింది అని చాలా మంది అడుగుతున్నారు.
దానికి సమాధానం చెబుతున్నా అంటూ సోమి అలీ ఇంస్టాగ్రామ్ పోస్ట్ పెట్టింది. ఆ 8 ఏళ్ళు నా జీవితంలోనే నేను గడిపిన దారుణమైన రోజులు. సల్మాన్ ఖాన్ తో నేను గడిపిన రోజుల్లో ఒక్కరోజు కూడా అతడు విలువైన వాడిగా నాకు అనిపించలేదు. చాలా ఏళ్ల పాటు తాను నా ప్రేయసి అని సల్మాన్ ఖాన్ ఎప్పుడూ పబ్లిక్ గా చెప్పలేదు. కానీ ఆ విషయం బయటకి చెప్పినప్పుడు నన్ను అతడి స్నేహితుల ముందు చిన్నచూపు చూస్తూ అవమానించాడు. సల్మాన్ ఖాన్ అహంకారంతో నేర్చుకున్నది ఒక్కటే. నన్ను కొట్టి శారీరకంగా హింసించాడు. నేను మగాడిని, మోసం చేసే హక్కు నాకుంది అంటూ అహంకారంతో మాట్లాడాడు. ఆ 8 ఏళ్ళు నేను బూతులు, లైంగిక వేధింపులు, శారీరక హింసతో నిద్రలేని రాత్రులు గడిపినట్లు సోమి అలీ సంచలన ఆరోపణలు చేసింది.