Friday, November 22, 2024

హీరో కావాల‌నేదే మా అబ్బాయి క‌ల‌- ప్ర‌భాక‌ర్

త‌న త‌న‌యుడు చంద్ర‌హాస్ ని హీరోగా ప‌రిచ‌యం చేస్తున్నాడు న‌టుడు..సీరియ‌ల్స్ నిర్మాత ప్ర‌భాక‌ర్. హీరో కావాలనేది మా అబ్బాయి కల. డిగ్రీ పూర్తిచేయగానే యాక్టింగ్ పై ఫోకస్ పెట్టాడు. ఈ జనరేషన్ పిల్లలు అవకాశాల కోసం వెళ్లి .. వెయిటింగులో ఉండే పరిస్థితి లేదు. దాంతో తానే యూ ట్యూబ్ కోసం ఓ కవర్ సాంగ్ చేశాడు. ఆ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చిందని అన్నాడు. నా స్నేహితులతో కలిసి నేనే మా వాడితో ఒక సినిమా చేయాలనుకున్నాను. కానీ ఈ లోగా 3 సినిమాలలో చేసే ఛాన్స్ వచ్చింది. రెండు సినిమాలు ఆల్రెడీ పూర్తయ్యాయి .. ఒక సినిమా వచ్చేనెలలో మొదలవుతుంది. మా అబ్బాయి కోసం వచ్చే కథలు వింటూ వెళుతున్నాను. తనతో నేను చేయాలనుకున్న సినిమాను జనవరిలో మొదలుపెడతాన‌ని చెప్పాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement