Monday, November 18, 2024

నేను తిరిగి వ‌చ్చేశా.. షూటింగ్ లోకేష‌న్ లో న‌టి హంసానందిని

నేను తిరిగి వచ్చేశా అని పోస్ట్ పెట్టింది న‌టి హంసానందిని. ఈమె బ్రెస్ట్ కేన్సర్ బారిన పడడం తెలిసిందే. చికిత్సతో దీన్ని విజయవంతంగా అధిగమించిన హంసా నందిని తిరిగి సినిమాల్లో నటించడం మొదలు పెట్టారు. వంశపారంపర్యంగా ఆమె బ్రెస్ట్ కేన్సర్ బారిన పడడం గమనార్హం. 2021 డిసెంబర్ లో ఈ కఠిన నిజాన్ని ఇన్ స్టా గ్రామ్ లో ఆమె బయటపెట్టింది. తొమ్మిది సైకిల్స్ కీమోథెరపీ తీసుకున్నానని, మరో ఏడు సైకిల్స్ తీసుకోవాల్సి ఉన్నట్టు వెల్లడించింది. ఓ సినిమా షూటింగ్ కు హాజరైన హంసానందిని తన తాజా ఆరోగ్య స్థితిని వివరించింది. మూవీ సెట్ లో ఉంటే మళ్లీ జన్మించిన అనుభూతి కలుగుతోంది. కెమెరా ముందు సజీవంగా ఉండే చోట నా పుట్టిన రోజు రావడం మంచి మార్గమని తెలుసు. నా తోటి నటులు, సినిమా సిబ్బందితో వేడుకలు జరుపుకుంటాను. మీ నుంచి అపార ప్రేమ, మద్దతు లేకుండా ఇది సాధ్యమయ్యేది కాదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement