నటుడు అర్జున్ తల్లి లక్ష్మీదేవమ్మ కన్నుమూశారు..ఆమె వయసు 85 సంవత్సరాలు. గతకొంత కాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. బెంగళూరు అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె కన్నుమూశారు. మైసూర్ లో ఆమె స్కూల్ టీచర్ గా పని చేశారు. ఆమెకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఆమె భౌతికకాయం ఇంకా ఆసుపత్రిలోనే ఉన్నట్టు సమాచారం. లక్ష్మిదేవమ్మ మృతి పట్ల కన్నడ సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. అర్జున్ కుటుంబసభ్యులను పరామర్శిస్తున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement