Friday, November 22, 2024

అన‌సూయ‌కి.. ఇండిగో ఎయిర్‌లైన్ స‌ర్ ప్రైజ్ గిఫ్ట్

యాంక‌ర్ ..న‌టి అనసూయ రెండు రోజుల క్రితం రాజమండ్రి విమానాశ్రయానికి వెళ్లింది. అక్కడ ఇండిగో విమానం కోసం వెచి ఉంది. అయితే ఈ ఎయిర్‌లైన్‌ విషయంలో ఆమె అసంతృప్తికి గురైందట. ఇండిగో ఎయిర్‌లైన్‌ సర్వీస్‌ పట్ల తను అసంతృప్తిని వ్యక్తం చేసింది. తాను అధికారికంగానే ఈ సర్వీస్‌ని అసహ్యించుకుంటున్నానని పోస్ట్ చేసింది. నేను ఇండియో ఎయిర్‌లైన్‌ని అధికారింగానే ద్వేషిస్తున్నా. ఇక్కడి దేశీయ విమానయాన సంస్థలను ఆధిక్యంలో ఉంచడం విచారకరం. సేవా ప్రమాణాలు ఇక్కడ చాలా స్టూపిడ్‌గా ఉన్నాయని పేర్కొంది అనసూయ. దీనికి ఎయిర్‌లైన్‌ నిర్వహకులు స్పందించారు. త్వరలోనే మిమ్మల్ని తిరిగి ఆన్‌ బోర్డ్ లో స్వాగతించే అవకాశం ఉంటుందని, భవిష్యత్‌లో మీకు మరింత మెరుగైన సేవలందించేందుకు అవకాశం ఉంటుందని వెల్లడించారు. మేడమ్‌ మీరు రాజమండ్రి విమానాశ్రయంలో మా బృందాన్ని కలిసినందుకు ధన్యవాదాలు.

సజావుగా, అవాంతరాలు లేని బోర్డింగ్‌ అనుభవాన్ని నిర్థారించడానికి సీక్వెన్షియల్‌ బోర్డింగ్‌ ప్రక్రియ అనుసరించబడుతుంది, మీకు కలిగిన అసౌకర్యానికి మేం చింతిస్తున్నాం అని ఇండిగో ఎయిర్‌లైన్‌ సంస్థ పేర్కొంది. అంతేకాదు ఆమెకి క్షమాపణలతో కూడిన ఓ సర్‌ప్రైజింగ్‌ ప్యాక్‌ని పంపించింది. ఇందులో తమ ఎయిర్‌లైన్‌లో ప్రయాణించినందుకు ధన్యవాదాలు చెబుతూ, హ్యాపీ జర్నీ అని పేర్కొంది. వారి సర్‌ప్రైజ్‌కి ఫిదా అయిన అనసూయ తానే తొందరపడ్డానని పేర్కొంది. సరే నేను నిన్న తొందరపడ్డాను. ఇది ఒక నిర్ధిష్ట నగరంలో ప్రాంతీయ సమస్య కవొచ్చు, ఇదిగో నాకు ఇష్టమైన రాజమండ్రి విమానాశ్రయంలో జయంత్‌, రామ, ఇండిగో బృందం చేసిన స్వీట్‌ గెచ్చర్‌(మధురమైన సంజ్ఞ)కి ధన్యవాదాలు. మీ సిబ్బంది అందరు ఇంత ఆప్యాయంగా, స్వాగతించేలా ఉండాలని కోరుకుంటున్నా అని పేర్కొంది. తాను నిరాశని వ్యక్తం చేసినప్పుడు నా ఆనందాన్ని కూడా వ్యక్త పరచాలి. మీకు తెలిసిందే కాదా, అనసూయ ముక్కుసూటి మనిషి అని, ఏదున్నా ఎదురుగానే మాట్లాడుతుందని. ఓకే సీ యా` అంటూ పేర్కొంది అనసూయ. ఇది సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement