రాజస్థాన్‌కు చెందిన ఓ మంత్రి కుమారుడిపై అత్యాచారం ఆరోపణలు చేసిన యువతిపై ఢిల్లిలో దుండగులు యాసిడ్‌తో దాడి చేశారు. శనివారం రాత్రి ఢిల్లిలోని కలిండీ కంజ్ రోడ్డుపై బాధితురాలు వాకింగ్ చేస్తుండగా దుండగులు యాసిడ్ పోసి పరారయ్యారు. అప్రమత్తమైన తల్లి, బాధితురాలిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించి వైద్య చికిత్సలు చేయిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. రాజస్థాన్ మంత్రి మహేష్ జోషి కుమారుడు రోహిత్ జోషి గత ఏడాది ఫేస్‌బుక్ ద్వారా పరిచయమయ్యాడు. ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి.
ఈ నేపథ్యంలోనే ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు, పెళ్లి చేసుకుంటానని ప్రమాణం చేసి… పలుమార్లు తనపై అత్యాచారం చేశాడని పేర్కొంటూ ఢిల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లి కోర్టులో సదరు నిందితుడు ముందస్తు బెయిల్ తెచ్చుకున్నాడు. శనివారంనాడు పోలీసుల విచారణకు హాజరై వాంగ్మూలం ఇచ్చాడు. అదే రోజు రాత్రి బాధితురాలిపై యాసిడ్ దాడి జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.