Saturday, November 23, 2024

ఆగస్టు 8న అకౌంట్స్‌ ఆఫీసర్‌ పరీక్ష.. సెప్టెంబర్‌ 12 నుంచి జేఎల్‌ పరీక్షలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: టీఎస్‌పీఎస్‌సీ మరో రెండు ఉద్యోగ నియామక పరీక్షల తేదీలను ప్రకటించింది. మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌, అర్బన్‌ డెవలప్‌మెంట్‌ విభాగాల్లో అకౌంట్స్‌ ఆఫీసర్‌ (యూఎల్‌బీ), జూనియర్‌ అకౌంట్స్‌ ఆపీసర్‌ (యూఎల్‌బీ), సీనియర్‌ అకౌంట్స్‌ (యూఎల్‌బీ) పోస్టులకు ఆగస్టు 8వ తేదీన సీబీఆర్‌టీ పద్ధతిలో పరీక్ష నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్‌సీ ప్రకటించింది. అలాగే వివిధ సబ్జెక్టులకు సంబంధించి జూనియర్‌ లెక్చరర్ల ఉద్యోగ నియామక పరీక్షలు సెప్టెంబర్‌ 12, 13, 14, 20, 22, 25, 26, 27, 29వ తేదీలతో పాటు అక్టోబర్‌ 3వ తేదీన జరగనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement