తెెలంగాణలోని ప్రతి లక్ష మంది జనాభాలో 291 మందికి వినికిడి సమస్యలు ఉన్నట్లు తాజా సర్వేలో తేలింది. వీరిలో ఎక్కువ శాతం మంది 0 నుంచి 14 ఏళ్లలోపు చిన్నారులే ఉండడం ఆందోళన కలిగించే అంశమని వైద్య నిపుణులు చెబుతున్నారు. రాష్ట్రంలో వినికిడి లోపం సాధారణంగా ఉందని, ప్రతి 23 మందిలో ఒకరిని, 65 ఏళ్లు పైబడిన వారిలో మూడోవంతు మందిని ఈ సమస్యలు వేధిస్తున్నాయంటున్నారు. ఇక దేశంలో ప్రతి సంవత్సరం 27,000 మంది పిల్లలు చెవిటివారిగా పుడుతున్నట్లు గణంకాలు చెబుతున్నాయి. ప్రపంచంలో ప్రతి 1000 జననాలకు 13 మందిలో వినికిడి లోపం తలెత్తుతోంది. ప్రతి 1,000 మందిలో 12 మంది బాల్యంలోనే శాశ్వత వినికిడి లోపంతో బాధపడుతున్నారు. అసురక్షితమైన పద్దతులతో వినడం కారణంగా 1 బిలియన్ కంటే ఎక్కువ మంది యువకులు శాశ్వతమైన, నివారించలేని వినికిడి నష్టానికి గురయ్యే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది.
పుట్టినపుడే వినికిడి టెస్టులు చేయాలి…
నవజాత శిశువులు, అప్పుడే జన్మించిన శిశువులను వినికిడి స్క్రీనింగ్ ప్రోగ్రామ్‌తో పరీక్షించడం ద్వారా ఈ లోపాన్ని తగ్గించొచ్చు. ప్రభుత్వ మరియు ప్రైవేట్‌తో సహా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పీడియాట్రిక్ ఆసుపత్రులు ”క్యాచ్ దమ్ యంగ్” థీమ్‌ను అనుసరించాల్సిన అవసరం ఉంది. వినికిడి లోపం భారాన్ని తగ్గిం చడానికి మరియు పూర్తిగా లేదా పాక్షికంగా వినికిడి లోపం ఉన్నవారికి పునరావాసం కల్పించడానికి ఎన్‌జివోలు మరియు ఇతర స్వచ్ఛంద సంస్థలతో పాటు ప్రభుత్వ యంత్రాంగం కృషి చేయాలి అంటున్నారు వైద్య నిపునులు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..